రష్యా విమానం కూలిన చోట బ్లాక్ బాక్సు, 12 శవాలు , 156 విమాన ముక్కలు దొరికినాయికూలిపోయిన రష్యన్ మిలిటరీ విమానం నుండి బ్లాక్ బాక్సును కనుగొన్నారు. 12 శవాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల నల్ల సముద్రములో కూలిపోయిన ఈ సైనిక విమానంలో మొత్తం 92 మంది చనిపోయారు.
ఈ ప్రమాదం జరగడానికి పైలెట్ తప్పిదము గానీ, సాంకేతిక లోపము గానీ కారణము కావచ్చునని భావిస్తున్నారు. ఈ దొరికిన బ్లాక్ బాక్సులో విమాన ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దానిని విశ్లేషించడానికి మాస్కో నగరానికి పంపారు. ఆ విమానంలో ఎర్రసైన్యం యొక్క గాయకబృందము, డాన్సర్లు రష్యన్ సైన్యానికి కొత్త యేడు వేడుకల కోసం ప్రయాణీకులతో కలిసి వెళుతున్నారు. విమానము కూలిపోయిన చోట విమానానికి చెందిన  156 ముక్కలు 12 శవాలు ఈతగాళ్ళకు దొరికాయని రష్యా రక్షణ మంత్రి తెలిపాడు.  
రష్యా విమానం కూలిన చోట బ్లాక్ బాక్సు, 12 శవాలు , 156 విమాన ముక్కలు దొరికినాయి రష్యా విమానం కూలిన చోట బ్లాక్ బాక్సు, 12 శవాలు , 156 విమాన ముక్కలు దొరికినాయి Reviewed by Ajit Kumar on 6:01 PM Rating: 5

No comments:

Powered by Blogger.