An 18 year old from Srinagar becomes an ambassador for Swachhata Hi Seva


Image result for An 18 year old from Srinagar becomes an ambassador


18 యేళ్ళ బిలాల్ దార్ అనే శ్రీనగర్ కు చెందిన చెత్త ఏరుకునే కుర్రవాడు శ్రీనగర్ మునిసిపల్ కార్పోరేషన్ స్వచ్ఛకీసేవ అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడ్డాడు. అతడు తన 12వ యేటనుండి స్వచ్చతాఅభియాన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా తన మన్జీబాతులో చెప్పారు.


స్వచ్చహిసేవ కార్యక్రమంలో కొత్త విషయం ఏమిటంటే ప్రజల ఇంటివద్ద చెత్తను ఏరుకుంటాడు. దానిని చెత్తను కొనేవారికి అమ్ముతాడు. దీనిద్వారా మన పరిసరాలూ శుభ్రపడతాయీ అతనికి  ఎంతోకొంత ఆదాయమూ వస్తుంది. ఇది మన ప్రాంతంలో సాధారణంగా జరిగేదే.

ఉత్తర కాశ్మీరు ప్రాంతంలో బండిపోరా జిల్లాలోని లహర్వార్పోరాలో నివశించే బిలాల్ దార్ ఉలార్ సరస్సు నుండి రోజూ ప్లాస్టిక్ వ్యర్ధాన్ని సేకరించి రు.150/- నుండి 200/- కు అమ్ముకుంటూ ఉంటాడు. దాదాపు ఐదేళ్ళనుండి ఇలాగే చేస్తున్నాడు. ఇతను చాలామందికి ఆదర్శంగా ఉన్నాడని మున్సిపల్ కమీషనర్ డాక్టర్ శ్రీ షాఫ్ ఖ్వట్ ఖాన్ చెప్పారు. అంటే అతను సంవత్సరానికి 12 వేల కిలోల చెత్తను సేకరించాడు.

 బ్రాండు అంబాసిడర్ అనే పేరుతో అతనికి ప్రత్యేక యూనిఫాము, ప్రజలను కలుసుకోవడానికి వీలుగా అతనికో వాహనము ఇచ్చారు. తన కొత్త ఉద్యోగం గురించి దార్ ఏమన్నాడంటే తనకు చాలా సంతోషంగా ఉందనీ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రజలను కలుసుకొని పరిశుభ్రతను గురించి చెప్పడం ఇంకా బాగుందని అన్నాడు.
An 18 year old from Srinagar becomes an ambassador for Swachhata Hi Seva An 18 year old from Srinagar becomes an ambassador for Swachhata Hi Seva Reviewed by Ajit Kumar on 10:12 AM Rating: 5

No comments:

Powered by Blogger.