Sourav Ganguly should be BCCI president. Here’s why



సౌరవ్ గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడు కావాలి. ఎందుకంటే దానిలో జరిగే అంతర్గత రాజకీయాల గురించి బాగా తెలిసిన వాడూ, అది చేసే ప్రయోగాలవల్ల బాధలు అనుభవించినవాడూ గనుక. సౌరవ్ గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడు కావడానికి 7 కారణాలు ఉన్నాయి.
ఒకటి భారతీయ క్రికెట్టు టీమును టెష్టు ఆటల్లో ఒకరోజు ఆటల్లో కూడా  విజయవంతంగా నడిపినవాడు. అతని సహకారం లేకపోతే హర్భజన్ సింగూ, వీరేంద్ర సెహ్వాగ్గూ, యమ్మెస్ ధోనీ వుండేవారేకాదు. ఆటగాళ్ళను ప్రోత్సహించి వాళ్ళ ఒకటి రెండు గేములలో వెనుకబడినప్పటికీ వారిలో ఆత్మవిశ్వాసం నింపిన నాయకుడు సౌరవ్ గంగూలీ. విజయం కోసం పోరాడాలని నేర్పినవాడు సౌరవ్. టీము కష్టాలలో ఉన్నప్పుడు గంభీరమైన నాయకత్వ పటిమతో నిలిపినవాడు సౌరవ్. బోర్డు చేసే పనులలోని లోపాలు తెలిసినవాడు. ఆటలో బోర్డు చేసిన మార్పుల వల్ల బాధలు పడినవాడు సౌరవ్. టీం కెప్టెన్ గా గంగూలీ పిచ్చ్ స్వభావాన్ని గురించి, వాతావరణ స్థితిని గురించి తన టీం సభ్యుల బలం బలహీనతలగురించి , ఎదుటి టీం బలం బలహీనతల గురించి ఎత్తుగడల గురించి తెలిసినవాడు సౌరవ్. ఏఏ బాట్స్ మెన్లకు ఎలాంటి బౌలర్లను ఉపయోగించాలో, ఫీల్డును ఎలా సెట్ చెయ్యాలో తెలిసిన వాడు సౌరవ్. క్రికెట్ కామెంటేటర్ గా సమర్ధవంతంగా పనిచేశాడు. సౌరవ్ ఏవిషయంలోనూ రాజీపడడు. తన మనసులో ఏమనుకుంటాడో అదే మాట్లాడతాడు.  
గంగూలీ బెంగాలు క్రికెట్ అసోసియేషనుకు అధ్యక్షునిగా సమర్ధవంతంగా  పనిచేసాడు. ఈడెన్ గార్డన్ స్టేడియం సామర్ద్యాన్ని 65వేలనుండి 37వేలకు తగ్గించడం ద్వారా ప్రేక్షకులకు సౌకర్యవంతంగా వుండేలా మార్చాడు.
కనుక అన్ని విధాలుగా సమర్ధుడైన సౌరవ్ గంగూలీని బిసిసిఐ చైర్మన్ గా నియమించడం సముచితం అని సందీపన్ బెన్ గారు వివరించారు.
Sourav Ganguly should be BCCI president. Here’s why Sourav Ganguly should be BCCI president. Here’s why Reviewed by Ajit Kumar on 7:53 PM Rating: 5

No comments:

Powered by Blogger.