Mexico Teen Shoots Teacher and Classmates Before Killing Himself



ఉత్తర మెక్సికో సిటీలో 15యేళ్ళ బాలుడు ఒక టీచరును, ఇద్దరు స్టూడెంట్లనూ తుపాకీతో తలపై కాల్చి, తనని తాను కాల్చుకున్మాడు.కాల్చిన వాడు ఆసుపత్రిలో చనిపోయాడు గానీ గాయపడిన ముగ్గురు చావుబ్రతుకుల్లో ఉన్నారు.  మరొక విద్యార్ధి తక్కువ గాయలయినాయి. ఈ కాల్పులను ఎవరో వీడియోతీసి సోషల్ మీడియాలో పెట్టారు.
  క్లాసులో టీచరు కూర్చొనివున్న పిల్లలకు మెటీరియల్ పంచుతుంది. పిల్లలందరూ కూర్చొనివుండగా ఆ అబ్బాయి పిస్టల్ తీసి తన ముందు కూర్చున్న అబ్బాయిని కాల్చాడు. కాల్చగానే ఆ పిల్లవాడు పడిపోయాడు. తరువాత మరోవైపు చూస్తున్న టీచర్ను కాల్చాడు ఆమె వెంటనే నేలపై పడిపోయింది. ఆ అబ్బాయి లేచి నడుస్తూ తన తోటి విద్యార్ధులను కాలుస్తూ పిస్టల్ తనవైపుకు తిప్పుకున్నాడు. అయితే మొదటిసారి అతనికి తగలకుండా ప్రక్కాగాపోయింది. తన పిస్టల్ లో బులెట్లు అయిపోయాయి. తన వీపున ఉన్న సంచిలోనుండి బులెట్లు తీసి పిస్టల్ లోడ్ చేసుకున్నాడు. తరగతిలో పిల్లంతా డెస్కుల వెనక నక్కుతూ బయటికి పరుగెత్తుతున్నారు. ఆ అబ్బాయి పస్టల్ని తన తలకు గురిపెట్టి కాల్చుకుని క్రింద పడిపోయాడు. తనతోసహా మొత్తం నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 24యేళ్ళ టీచరుగారికి, 14యేళ్ళ బాలికకు,14యేళ్ళబాలునికి తలకు గాయాలయ్యాయి 15యేళ్ళ బాలునికి చేతికి గాయమయింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు నెట్లో పెట్టినవాడ్ని పట్టుకొని శిక్షిస్తామని రాష్ట్ర సెక్యూరిటీ ప్రతినిధి శ్రీ ఆల్డో ఫస్కి చెప్పారు. ఆ స్కూలులో ప్రీస్కూలు క్లాసునుండి 9వక్లాసు వరకూ కోయడ్యుకేషన్ లో నిర్వహిస్తున్నారనీ, ప్రతిరోజూ స్కూలుకు వచ్చేటప్పుడు గేటువద్ద పుస్తకాలసంచులు చెక్ చేయాలని మెక్సికో చట్టం ఉన్నప్పటికీ అన్ని స్కూళ్ళలో అది అమలు జరగడంలేదని చెప్పాడు. ఆ అబ్బాయి 0.22 క్యాలిబర్ పిస్టలును తన ఇంటినుండే తెచ్చాడని అది అతనికి ఎలావచ్చిందో తెలియలేదని అన్నాడు.
- అసోసియేటెడ్ వార్తాపత్రిక

Mexico Teen Shoots Teacher and Classmates Before Killing Himself Mexico Teen Shoots Teacher and Classmates Before Killing Himself Reviewed by Ajit Kumar on 1:07 PM Rating: 5

No comments:

Powered by Blogger.