India’s first known feminist on Google Doodle



మొదటి స్త్రీవాది సావిత్రిబాయి ఫూలే 186వ జయంతి సందర్భంగా గూగులు మొదటి పేజీలో ఆమె ఊహాచిత్రం ఉంచబడింది.

సావిత్రిబాయి ఫూలే బాలికల విద్యకోసం 18 బళ్ళు మొదలుపెట్టిన మొదటి మహిళా టీచరు, హెడ్మాస్టరు. గూగులు ఒక ప్రత్యేకమైన ఊహాత్మక రేఖా చిత్రాన్ని ఆమె గౌరవార్ధం తన మొదటి పేజీలో ప్రచురించింది.  1831వ సంవత్సరం జనవరి 3వ తేదీన జన్మిచిన సావిత్రిబాయి తన తొమ్మదవయేట 1840 లో 12యేళ్ళ జ్యోతీరావుఫూలేను పెండ్లిచేసుకుంది.   మహారాష్రా నాయిగాన్లకు చెందిన ఖాండోజి నెవెషె మరియు లక్ష్మి పాటిల్ ల పెద్దకూతురు సావిత్రిబాయి. 150 సంవత్సరాల క్రితం స్త్రీల అభివృద్దికోసం తన భార్యను చదివించి, ఆమెద్వారా స్త్రీలకు విద్యను అందించిన మహనీయుడు జ్యోతీరావు ఫూలే. సావిత్రిబాయి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని స్త్రీలకు విద్య నేర్పించింది. సమాజము లోని కులవివక్షను, లింగ వివక్షను వ్యతిరేకించింది. వాటిని తన కవితలద్వారా ఖండించింది. సామాజిక సేవలో ముందుండి పనిచేసింది. ప్రాణాంతకమైన ప్లేగు వ్యాధిగ్రస్తులకు సహాయము చేస్తూ ప్లేగు వ్యాధిసోకి చనిపోయింది.
India’s first known feminist on Google Doodle India’s first known feminist on Google Doodle Reviewed by Ajit Kumar on 12:19 PM Rating: 5

No comments:

Powered by Blogger.