Grandmother demanded to change her ugly grandson



ఒక నాయనమ్మ తన మనవడు అండంగా లేడని, ఆసుపత్రిలో మారిపోయవుండవచ్చని, తన మనవడిని మార్చి మరొక బాబును ఇవ్వాలని డిమాండు చేసింది. కొలంబియా లోని శాంతా మార్తా అనే ఆసుపత్రిలో కాన్పు అయిన తర్వాత తన మనవడిని, వాని తల్లిని తీసుకుని ఇంటికి వెళ్ళిన తరువాత ఆ బిడ్డ ముఖం అందంగా లేదని  బిడ్డ మారిపోయి వుంటుందేమోననే అనుమానంతో మరలా ఆ బిడ్డను ఆమె తల్లిని తీసుకొని ఆసుపత్రికి వచ్చి తమ అసలైన మనవడిని తమకు ఇవ్వాల్సిందేనని వాదించింది ఆ నాయనమ్మ.
ఆ రోజు పుట్టింది ఒక్క మగపిల్లవాడేనని అందువల్ల మారే అవకాశమే లేదని హాస్పటలు సిబ్బంది చెప్పారు.  జీవశాస్త్రం ప్రకారం జన్యు లోపాలవల్ల ఇటువంటి మార్పులు కనిపించవచ్చని వాటిని మనం అంగీకరించాల్సిందేనని చెప్పారు. ఆ బిడ్డ కు ఆరోగ్య పరీక్షలు చేసి ఇంటికి పంపారు.
చందన రోసాడో అనే పట్టణ కౌన్సిలరు మాట్లాడుతూ ఆ ముసలమ్మను మానసిక వైద్యునిచే పరీక్ష చేయించామని, ఒక్క సంఘటనతో వారి మానసిక స్థితిని నిర్ణయించలేమని ఆయన చెప్పాడట. ఆ పిల్లవాడు ఆరోగ్యంగానే ఉన్నాడు కానీ వాళ్ళ నాయనమ్మకు ఎందుకని వాడు అందవికారంగా కనిపిస్తున్నాడో అర్ధం కావడం లేదని అన్నాడు. 
Grandmother demanded to change her ugly grandson Grandmother demanded to change her ugly grandson Reviewed by Ajit Kumar on 5:14 PM Rating: 5

No comments:

Powered by Blogger.