Four-day working week could be trialled in Italy



వారానికి 4 రోజుల పని విధానం ఇటలీలో ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. ఉత్తర ఇటలీ ప్రాంతములోని ఎమిలియా రొమాంగ్నా లో అల్లేవా అనే ప్రాంతీయ అధికారి వారానికి 40 గంటలకు బదులుగా 32 గంటల వని విధానాన్ని ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాడు. దీనివల్ల 2 లక్షలమందికి ఉద్యోగాలు కల్పించవచ్చునని అన్నాడు. ఆ ప్రాంతం లో లక్షా అరవై వేలమంది నిరుద్యోగులున్నారట.

ఇటలీలో 1977లో  శనివారం సెలవు ఇవ్వడం మొదలైంది. అప్పుడు వారానికి 48 గంటల పని నుండి 40 గంటల పనికి తగ్గించారు. ఆ పద్దతిని ఇతర అభివృద్ది చెందిన దేశాలు ఆచరించాయి. ఇటలీకి చెందిన ఎవరైనా ఉద్యోగి వారానికి 40 గంటలకంటే ఎక్కువ కాలం పనిచేస్తే 1500 యూరోలు జరిమానా విధించేవారు . ఒక యూరో అంటే మన 72 రూపాయలు.
Four-day working week could be trialled in Italy Four-day working week could be trialled in Italy Reviewed by Ajit Kumar on 6:55 PM Rating: 5

No comments:

Powered by Blogger.