New Mother to Tamil Nadu





తమిళనాడు రాజకీయాలకు కొత్త అమ్మ శ్రీమతి శశికళ
శశికళా నటరాజన్ గారు తమిళనాడు రాష్ట్ర ప్రాంతీయ పార్టీ అయిన ఏఐఏడియంకె కు చనిపోయిన జయలలిత స్థానంలో నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సాధారణ గృహిణిగా మొదలైన శశికళ గారి ప్రయాణం 30 సంవత్సరాలపాటు తమిళనాడు పురచ్చితలైవికి అనుచరురాలుగా నడిచింది. ఆ ఉక్కు మహిళ మరణం తరువాత పార్టీ బాధ్యతలను స్వీకరించి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డది.
శశికళ గారు తంజావురులో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి, తమిళనాడు ప్రభుత్వంలో పబ్లిక్ రిలేషన్స్ అధిగారిగా పనిచేస్తున్న యం.నటరాజన్ గారిని పెళ్ళాడింది. 1975 ఎమర్జన్సీ కాలంలో తన భర్త వుద్యోగం ఊడినందున కుటుంబ పోషణకై వీడియోలు అద్దె షాపును నడిపారు. అప్పుడే జయలలితగారికి స్వచ్ఛంద సేవకురాలు అంటూ పరిచయం చేయబడ్డది. పోయస్ గార్డెనుకు వెళ్ళి జయలలిత గారికి కావలసిన వీడియోలు అందిస్తూవుండేది. ఆ పరిచయం బాగా పెరిగి వారిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. .
1980లో యంజిరామచంద్రన్ చనిపోయిన తరువాత పార్టీలో అనేకవిధాలుగా రాజకీయ యుద్ధం జరుగుతుండా  శశికళ గారు అమ్మకు తోడుగా పోయస్ గార్డెనులోనే నివశించారు. 1991 నుండి 1996 వరకూ గల జయలలిత మొదటి ముఖ్యమంత్రిగా పాలనాకాలంలో ఆమెతో పాటు ఆ ఇంటిలోనే స్ధిరనివాసిగా మారారు. శశికళ గారి కుటుంబ సభ్యులకు శశికళ భర్తతోసహా గొప్ప రాజకీయ ఆదరణ లభించింది. వారిపై  కొన్ని రాజకీయ సమస్యలు వచ్చినప్పటికీ  వాటన్నిటినీ జయలలిత తోసిపుచ్చారు. శశికళను తన ఆత్మీయ తోబుట్టువుగా ప్రకటించారు. శశికళ గారి అల్లుడైన వి.యన్. సుధాకరన్ గారిని తన పెంపుడు కొడుకుగా దత్తత చేసుకుంది. తమిళ సినీ దిగ్గజమైన శివాజీగణేషన్ మనుమరాలిని ఇచ్చి సుధాకరన్ తో పెండ్లి జరిపించింది.  అత్యంత వైభవంగా జరిగిన  ఆ పెండ్లికి ప్రభుత్వ వనరులు వాడుకున్నారని ఆమెపై అభియోగం వచ్చింది. దానివల్ల చాల నష్టం జరిగింది. 1996 ఎన్నికల్లో తన సీటుతోసహా ఓడిపోయింది. జైలు పాలయింది.   
దేవర అని పిలువబడే వెనుకబడిన కులానికి చెందిన శశికళ గారికి ఆకులంలో గట్టి బలముంది. ఏఐఏడీయంకే పార్టీలో కూడా ఆ కులం వారికి ఎక్కువ స్థానాలు కేటాయించింది. శశికళ ముక్కులతోర్ (దేవర) కులం వారు కొన్ని దళిత కులాలతో స్నేహంలోఉన్నాయి. రాజకీయాలలో శశికళ గారి శక్తి సామర్ధ్యాలు తెలిపే సంఘటనలు ఇంతవరకూ జరగలేదు. ఆమె సమర్ధురాలేనని తేలితే తమిళనాడు మరో అమ్మను పొందగలుగుతుంది.

New Mother to Tamil Nadu New Mother to Tamil Nadu Reviewed by Ajit Kumar on 9:19 PM Rating: 5

No comments:

Powered by Blogger.