Floods in D.R. Congo 50 killed





ప్రజాస్వామ్య గణతంత్ర కాంగో దేశపు నైరుతీ ప్రాంతంలో వచ్చిన వరదల వల్ల 50 మంది చనిపోయారూ వేలాదిగా ప్రజలు తమ ఇళ్ళు కోల్పోయారు. కుండపోతగా కురిసిన వానలకు బోమా నగరంలో ప్రవహించే కలమూ నది గట్లు తెంచుకొని నగరాన్ని ముంచేసింది. కొన్ని శవాలు ప్రక్కనే వున్న అంగోలా దేశంలోకి కొట్టుకుపోయాయి . ఆ నగరంలోని కొంత భాగం మీటరు ఎత్తున బురద పేరుకు పోయిందని నగర మేయరు లోకాసు గారు తెలిపారు.

ప్రతి పదేళ్ళకొకసారి ఇలాగే జరుగుతూంటుందట. 2015 జనవరిలో కూడా ఇలాంటి వరదలే వచ్చాయట మరి వెంటనే 2016 డిసెంబరులో మళ్ళీ వరదలు రావడమేమిటని కాంగో సెంట్రల్ ప్రోవెన్సు గవర్నరు జాక్వీస్ ఎంబడు గారు తెలిపారు. సాధారణంగా వచ్చే వరదల ప్రవాహం కన్నా 2 మీటర్ల ( 6 అడుగుల ) ఎత్తులో నీళ్ళు పారినట్లు తెలిపారు. అనేక సార్లు వరదలు రావడం, కొన్నేళ్ళు వర్షాలు లేక కరువు రావడం, తుఫానులు రావడం ఇవన్నీ చూస్తుంటే వాతావరణం మారుతున్నట్లుందని ఏ.ఎఫ్.పి.విలేఖరితో అన్నారు.   
Floods in D.R. Congo 50 killed Floods in D.R. Congo 50 killed Reviewed by Ajit Kumar on 11:53 AM Rating: 5

No comments:

Powered by Blogger.