5000 year old Stone painting found in Egypt





ఈజిప్టులో క్రీ.పూ. 5000 యేళ్ళ నాటి చేత్తోగీసినబొమ్మలు దొరికినాయి
 ఎరుపు గోధుమ రంగులతో రాతిపై గీసిన పాత బొమ్మల చిత్రం కనుక్కున్నారు. ఈజిప్టులోని సహారా ఎడారిలో జరిపిన పరిశోధనయాత్రలో కనుగొన్నట్లుగా ఇటలీలోని ఫ్లోరెన్సు వద్దగల ప్రాటోలోగల ప్లానిటరీ సైన్సెస్ మ్యూజియం డైరెక్టరు మర్కో మొరేలీ అనే జియాలజిస్టు తెలిపారు. ఆ ప్రాంతానికి తల్లిదండ్రుల గుహ అని పేరు పెట్టారు.

ఈ బమ్మలో తూర్పున ఒక చుక్క , మగ ఆడల మధ్య ఓ బిడ్డ , రెండు జంతువులు ఉన్నాయి. ఆడ బొమ్మకు తల లేదు బహుశా అక్కడి పెంకు లేచిపోయి వుండవచ్చు. బొమ్మలో అప్పుడే పుట్టిన బిడ్డ నేల కంటే ఎత్తులో గీయబడింది అంటే ఆకాశానికి ఎత్తబడిందని కావచ్చు. సహజంగా ఈ స్థానంలో బిడ్డను గీయడమంటే అది బిడ్డ పుట్టుకను చెప్పడానికిగానీ లేక ఆ స్త్రీ కడుపుతో ఉందని చెప్పడం కానీ కావచ్చు.
రాతిపై గీయబడ్డ బొమ్మలలో చావు భూమికి సంబంధించినదని, పుట్టుక ఆకాశమునకు సంబంధించనదని సూచించుతూవుంటాయని మొరెల్లీ గారు అన్నారు.
ఈ బొమ్మలో రెండు జంతువులనూ ఒక చిన్న గుండ్రని ఆకారాన్ని గీయబడి వుండడం ఈ బొమ్మను అర్ధం చేసుకోవడానికి కొంత కష్టతను ఏర్పరచింది.
బొమ్మ పై భాగంలో ఆ కాలము నాటి రాతి చిత్రాలలో కనిపించిన ఒక పురాణ జంతువు అయిన ఒక తలలేని సింహం ఉంది. దాని క్రింద ఒక కోతిని గీసాడు దానికి తూర్పుగా ఒక నక్షత్రాన్ని గీసాడు.
ఇది ఒక చమత్కార చిత్రము అని మొరెల్లీ గారు అన్నారు. క్రీస్తు శకప్రారంభంలో ఇలాంటి చిత్రాలు మనం చూడలేదని అన్నాడు.
5000 year old Stone painting found in Egypt 5000 year old Stone painting found in Egypt Reviewed by Ajit Kumar on 1:05 PM Rating: 5

No comments:

Powered by Blogger.