35 US diplomats to be expel from Russia





రష్యా విదేశాంగమంత్రిత్వశాఖ వాషింగుటన్ చేసిన మాదిరిగానే దానికి బదులుగా 35 మంది అమెరికా దౌత్య ప్రతినిధులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. విదేశాంగ శాఖా మంత్రి సెర్జయి లావురోవు ఈ ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా అధ్యక్షుడు పుతిన్ ను కోరాడు. ఒబామా ప్రభుత్వము 35 మంది రష్యా దౌత్యవేత్తలనూ వారి కుటుంబాలతోసహా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో హాకింగ్ చేశారనే భావనతో బహిష్కరించింది.

రష్యా ఈ ఆరోపణలను ఖండించింది అమెరికా చేసిన ఆరోపణ నిరాధారమైనదని తాము అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జోక్యం చేసుకోలేదని ఆ విషయమై ఎవరితోనూ మాట్లాడలేదని తెలిపింది.
రష్యా ప్రధాన మంత్రి డిమిట్రీ మెద్వదేవుడు దిగిపోతున్న అధ్యక్షుడు బరాకు ఒబామా ప్రభుత్వము చేసిన ఈ నేరారోపణ తమకు మరణవేదన కలిగిస్తుందని అన్నారు.
గురువారం నాడు అమెరికా ప్రభుత్వం ఈ క్రింది చర్యలు గైకొంది.
1.       రష్యావారి వాషింగుటను రాయబారకార్యాలయము నుండి మరియు శాను ప్రాన్నిస్కో లోని దాని రాయబార కార్యాలయము నుండి 35 మంది దౌత్యవేత్తలు నిషేధింపబడినవారుగా ప్రకటించబడి 72 గంటలలో వారు తన కుటుంబాలతో సహా అమెరికా దేశం విడిచి వెళ్ళిపోవాలి.
2.       న్యూయార్కులోనూ మేరీలాండులోనూ రష్యా గూఢచారీ సంస్థలుగా పనిచేస్తున్న రెండు భవనాలూ మూసివేయాలి.
3.       రష్యా గూఢచారీ సంస్థలైన జిఆర్యూ,ఎఫ్ఎస్బిలతోసహా తొమ్మిది వ్యక్తులు సంస్థలకూ ఇచ్చిన అనుమతులు నిలిపివేయబడ్డాయి.

జనవరి 20వ తేదీన అధ్యక్షునిగా డోనాల్డు ట్రంపుగారు ప్రమాణస్వీకారం చేయబోతుండగా దిగిపోబోతున్న ఒబామా గారు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమోక్రాటిక్ పార్టీ, హిల్లరీ క్లింటన్ ఎన్నికల కార్యాలయము లపై రష్యా సైబరు దాడి చేసారని ఆరోపిస్తూ వారిపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ప్రతిజ్ఞ చేశాడు.
హిల్లరీ క్లింటన్ మానేజరు వద్ద నుండీ డెమోక్రాటికు జాతీయ కమిటీ కంప్యూటరు సర్వరు నుండీ ఈ-ఉత్తరాలు దొంగిలించారని  సైబరు దాడులు చేశారనీ వికీలీక్సు వెబ్సైటు ద్వారా వెల్లడైందని తెలిపారు.

అంతర్జాతీయ సంబంధాలలో దౌత్య చట్టాల ప్రకారం పరస్పర అంగీకారం గల విషయాలనే మాట్లాడాలి అని లావురోవు గారు అన్నారు. 31 మంది అమెరికా దౌత్యవేత్తలను మాస్కోనుండీ నలుగురిని సెయింటు పీటర్సుబర్గు నుండి బహిష్కరించబోతున్నట్లు చెప్పారు.    
35 US diplomats to be expel from Russia 35 US diplomats to be expel from Russia Reviewed by Ajit Kumar on 5:59 PM Rating: 5

No comments:

Powered by Blogger.